Vijay Merchant Trophy: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఆరు పరుగులకే ఆలౌట్
Sakshi Education
బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది.
ఒక ఆటగాడు ఫోర్ కొట్టగా, మరో ప్లేయర్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్‌లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఇటీవల బిగ్‌బాష్ లీగ్ 2022 టోర్నీలో సిడ్నీ థండర్ టీమ్ 15 పరుగులకి ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు క్రియేట్ చేసింది.
T20I: టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు
Published date : 24 Dec 2022 11:48AM