T20 World Cup 2021: టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
Sakshi Education
టి20 వరల్డ్‌కప్–2021లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 8న ప్రకటించింది.
విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. మరో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా టీమ్‌లోకి ఎంపిక చేశారు. జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్మెస్ ధోని ఈసారి కొత్తగా ‘మెంటార్’ పాత్రలో జట్టుతో కలిసి పని చేయనున్నాడు. ఒమన్, యూఏఈలలో 2021, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్ని జరగనుంది.
భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్, జడేజా, రాహుల్ చహర్, అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్, షమీ. స్టాండ్‌బై: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్.
Published date : 09 Sep 2021 06:52PM