Swiss Open Title: సాత్విక్–చిరాగ్ జోడీకి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్
68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. మార్చి 26న హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ.13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
☛ సాత్విక్–చిరాగ్ కెరీర్‌లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్ 5. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు.
☛ స్విస్ ఓపెన్‌లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022).. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్‌ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018).. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు.