Skip to main content

Breast Cancer: బర్త్‌ కంట్రోల్‌ మాత్రలతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు!

హార్మోనల్‌ గర్భనిరోధక మాత్రల వాడకంతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు స్వల్పంగా పెరుగుతున్నట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనంలో వెల్లడయ్యింది.
birth control pills

అన్ని రకాల హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌తో ఈ ముప్పు ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనం వివరాలను ‘ప్లస్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురించారు. గర్భనిరోధక మాత్రల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు 20 శాతం నుంచి 30 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. 
ప్రపంచవ్యాప్తంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రల వినియోగం అధికంగా ఉంది. ఈ రెండు హార్మోన్లతో కూడిన మాత్రల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తలెత్తే అవకాశం ఉన్నట్లు గతంలోనే తేలినా, కేవలం ప్రొసెస్టిరాన్‌ ఉన్న మాత్రల వల్ల కూడా ఈ ముప్పు ఉన్నట్లు స్పష్టంగా వెల్లడి కావడం ఇదే ప్రథమం. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 24 Mar 2023 03:55PM

Photo Stories