Skip to main content

BWF World Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) పురుషుల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నారు.

డిసెంబ‌ర్ 20న‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ 75,806 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఈ సంవత్సరం సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌–500, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీల్లో టైటిల్స్‌ సాధించింది. అంతేకాకుండా కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, థామస్‌ కప్‌లో తొలిసారి భారత్‌ చాంపియన్‌గా అవతరించడంలోనూ వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో లక్ష్య సేన్‌ ఏడో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. ప్రణయ్‌ రెండు స్థానాలు పురోగతి సాధించి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిడాంబి శ్రీకాంత్‌ 11వ స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌లో మార్పు లేదు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌లో నిలిచింది.   

ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం

Published date : 21 Dec 2022 04:55PM

Photo Stories