Hyderabad Black Hawks: ఏ నగరం వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022 జరగనుంది?
2022, ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జనవరి 28న హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే ఈ లీగ్‌కు ఏ23 కంపెనీ సహ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
మొత్తం ఏడు జట్లు..
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్ బోల్ట్స్ పాల్గొననున్నాయి.
చదవండి: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
ఎక్కడ : హైదరాబాద్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్