Muscat: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్–2022లో జపాన్ జట్టు విజేతగా అవతరించింది. ఒమన్ రాజధాని నగరం మస్కట్ వేదికగా జనవరి 28న ఫైనల్లో జపాన్ 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇదే టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చైనా జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించి, కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 10 సార్లు జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు విజేతగా (2004, 2017), రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), మూడుసార్లు మూడో స్థానంలో (1993, 2013, 2022) నిలిచింది.
చదవండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నిలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన జంట?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్–2022లో విజేతగా అవతరించిన జట్టు?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : జపాన్ జట్టు
ఎక్కడ : మస్కట్, ఒమన్
ఎందుకు : ఫైనల్లో జపాన్ 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్