Skip to main content

Roger Federer Announces Retirement : షాకింగ్ న్యూస్.. టెన్నిస్ కు రోజర్ ఫెడరర్ వీడ్కోలు.. కార‌ణం ఇదే..

ప్ర‌పంచ టెన్నిస్ అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్ చెప్పాడు.. టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్న‌ట్టు.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నాడు.
Roger Federer

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్..  వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఫెదరర్‌కు దాదాపు 13 మిలియన్ల మంది ట్విట్టర్‌ ఫాలోయర్స్ ఉన్నారు. తనకు ఇప్పుడు 41 సంవ‌త్స‌రాలు.  ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT)గా పిలువబడే ఫెడెక్స్‌ తన కెరీర్‌లో మొత్తం 20  గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. కెరీర్‌లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడిన అతను.. 310 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా కొనసాగాడు. 

తొలి ఆటగాడిగా..

Roger Federer Announces Retirement

ఇటీవలే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన నాదల్‌.. కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ను కొల్లగొట్టాడు. తద్వారా టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన తొలి ఆటగాడిగా నాదల్‌ రికార్డులకెక్కాడు. ఇక నొవాక్‌ జొకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌లు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నాదల్‌..'' ఈ సంఖ్య‌లో గ్రాండ్‌స్లామ్‌లు సరిపోవని.. నిజాయితీగా చెప్పాలంటే నా శక్తి ఉన్నంత కాలం టెన్నిస్‌ ఆడాలనుకుంటున్నా.. ఆలోపు మరిన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవాలని కోరుకుంటున్నా'' అంటూ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.

Federer has struggled with a knee problem for the past three years that has restricted him to only three of the 11 Grand Slams staged since the start of 2020. He has not played a competitive match since losing to Hubert Hurkacz in the quarter-finals at Wimbledon last summer. He subsequently announced he needed more surgery on his knee having previously had two operations in 2020.

Sakshi Education Mobile App

Published date : 15 Sep 2022 07:50PM

Photo Stories