Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్‌గా నియమితులైన ఆటగాడు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ.. చెన్నై సూపర్ కింగ్స్(ïసీఎస్‌కే) జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ధోని స్థానంలో మరో సీనియర్ రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. జట్టులో సభ్యుడిగానే ఉంటూ ధోని మార్గనిర్దేశనం చేయనున్నాడు. ఈ మేరకు మార్చి 24న ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన ప్రకారం.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తొలి సారి నాయకుడిగా టీమ్‌ను నడిపించనున్నాడు. ధోని, రైనా (5 మ్యాచ్‌లు) తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మూడో ఆటగాడు జడేజా.
Hyderabad: ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేసిన ఐఎస్‌ఎల్ జట్టు?
సత్యన్–మనిక జోడీకి రజతం
డబ్ల్యూటీటీ కంటెండర్ దోహా 2022 టేబుల్ టెన్నిస్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత ద్వయం జి.సత్యన్–మనిక బాత్రా రజత పతకం సాధించింది. ఖతర్ రాజధాని దోహాలో మార్చి 24న జరిగిన ఫైనల్లో సత్యన్–మనిక జోడి 4–11, 5–11, 3–11 తేడాతో టాప్ సీడ్ లిన్ యున్ జు – చెంగ్ ఐ చింగ్ (చైనా) చేతిలో పరాజయంపాలైంది. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్లో ఓడిన మరో భారత ప్యాడ్లర్ ఆచంట శరత్‌కమల్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
Retirement from Tennis: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరల్డ్ నంబర్‌వన్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ.. చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్‌గా నియమితులైన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : రవీంద్ర జడేజా
ఎందుకు : సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్