Hyderabad: ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేసిన ఐఎస్‌ఎల్ జట్టు?
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ).. హైదరాబాద్ నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. తాజాగా దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్‌ఎఫ్‌సీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీ’ని హెచ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు.
Retirement from Tennis: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరల్డ్ నంబర్‌వన్?
మహేశ్వరికి రజత పతకం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్‌లో తెలంగాణ అథ్లెట్ జి.మహేశ్వరి రజత పతకం సాధించింది. కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలో మార్చి 23న జరిగిన ఈ మీట్‌లో మహేశ్వరి 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 10 నిమిషాల 52.49 సెకన్లలో గమ్యానికి చేరింది. పారుల్ (ఉత్తరప్రదేశ్; 9ని:38.29 సెకన్లు) స్వర్ణ పతకాన్ని గెలిచింది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే (మహారాష్ట్ర; 8ని:16.21 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు.
Football: ఐఎస్‌ఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ)
ఎక్కడ : గాడియమ్ స్కూల్, కొల్లూరు, హైదరాబాద్
ఎందుకు : ఫుట్‌బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్