Skip to main content

Qatar Grand Prix 2023: ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత‌గా వెర్‌స్టాపెన్‌

వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 14వ విజయం నమోదు చేసుకున్నాడు.
 F1 world championships, Max Verstappen achievements,Qatar Grand Prix 2023,Formula 1 champion Max Verstappen with his third title
Qatar Grand Prix 2023

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతర్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 39.168 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

Asian Games 2023: జయహో భారత్‌ 107

ఆస్కార్‌ పియస్ట్రీ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌), కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగారు. ఈ ఫలితంతో వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో మరో ఐదు రేసులు మిగిలి ఉండగానే 433 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 17 రేసులు ముగిశాయి. ఇందులో 14 రేసుల్లో వెర్‌స్టాపెన్, రెండు రేసుల్లో పెరెజ్‌ (రెడ్‌బుల్‌), మరో రేసులో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) గెలిచారు. 2021, 2022లలో కూడా వెర్‌స్టాపెన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్‌ఎ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది.

Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారతకు స్వ‌ర్ణం  

Published date : 11 Oct 2023 12:42PM

Photo Stories