Orleans Masters: ప్రపంచ 12వ ర్యాంకర్‌పై ప్రియాన్షు విజయం
Sakshi Education
ఓర్లియాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతార ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు.
![Priyanshu Rajawat](/sites/default/files/images/2023/04/07/priyanshu-1680852464.jpg)
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు ప్రపంచ 12వ ర్యాంకర్, టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. గతవారం స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు 21–8, 21–16తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
థామస్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రియాన్షు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 10–0తో ఆధిక్యంలోకి వెళ్లడం విశేషం. రెండో గేమ్‌లో ప్రియాన్షుకు పోటీ ఎదురైనా కీలకదశలో పాయింట్లు గెలిచి 42 నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడతాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Published date : 07 Apr 2023 12:57PM