Astana Open trophy: జొకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్
Sakshi Education
సెర్బియా టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ వారం వ్యవధిలో రెండో టైటిల్‌ను సాధించాడు.
గతవారం టెల్ అవీవ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ మాజీ నంబర్‌వన్ తాజాగా అస్తానా ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. కజకిస్తాన్‌లో అక్టోబర్ 9న జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. ఈ సీజన్‌లో జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్‌కాగా కెరీర్‌లో 90వ టైటిల్. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 3,55,310 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 94 లక్షలు) దక్కింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Oct 2022 06:40PM