Table Tennis: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీ?
వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన మనిక బత్రా–అర్చన కామత్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. స్లొవేనియాలోని లాస్కో నగరంలో నవంబర్ 7న ముగిసిన ఈ టోర్నీలో మనిక–అర్చన ద్వయం మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో మనిక–అర్చన జంట 11–3, 11–8, 12–10తో మెలానీ –అడ్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) జోడీపై విజయం సాధించింది.
అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య
భారత్‌కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ నవంబర్ 7న యూఏఈ రాజధాని అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్‌గా పని చేస్తున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
చదవండి: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021కు ఆతిథ్యం ఇచ్చిన నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్న జోడి?
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : మనిక బత్రా–అర్చన కామత్ జోడీ
ఎక్కడ : లాస్కో నగరం, స్లొవేనియా
ఎందుకు : ఫైనల్లో మనిక–అర్చన జంట 11–3, 11–8, 12–10తో మెలానీ –అడ్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) జోడీపై విజయం సాధించినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్