AIBA: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021కు ఆతిథ్యం ఇచ్చిన నగరం?
ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్(2021 ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్) భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో నవంబర్ 5న జరిగిన 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
అమిత్ పంఘాల్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు.
చదవండి: National Sports Awards 2021: ఖేల్‌రత్న అవార్డును ఎంతమందికి ప్రదానం చేయనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్(2021 ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్)లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్?
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ఆకాశ్ కుమార్
ఎక్కడ : బెల్‌గ్రేడ్, సెర్బియా
ఎందుకు : 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్