Skip to main content

National Sports Awards 2021: ఖేల్‌రత్న అవార్డును ఎంతమందికి ప్రదానం చేయనున్నారు?

Sports Awards

National Sports Awards 2021: 2021 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్‌ 3న ప్రకటించింది. నవంబర్‌ 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది పురస్కారాల్లో 12 మందిని ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే 35 మంది అర్జున అవార్డుకు, పది మంది ద్రోణాచార్య అవార్డుకు, ఐదుగురు ద్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు ఇలా....

ద్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న పురస్కార విజేతలు...

1. నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌): టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం 
2. మిథాలీ రాజ్‌ (క్రికెట్‌)
3. సునీల్‌ ఛెత్రి (ఫుట్‌బాల్‌)
4. రవికుమార్‌ దహియా (రెజ్లింగ్‌): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం
5. పీఆర్‌ శ్రీజేశ్‌ (హాకీ): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో సభ్యుడు
6. లవ్లీనా బోర్గోహెయిన్‌ (బాక్సింగ్‌): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం
7. ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
8. సుమీత్‌ అంటిల్‌ (జావెలిన్‌ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
9. అవని లేఖరా (షూటింగ్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం 
10. కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
11. మనీశ్‌ నర్వాల్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
12. మన్‌ప్రీత్‌ సింగ్‌(హాకీ)

 

అర్జున అవార్డుకు ఎంపికైన వారు...

1. అర్పిందర్‌ (అథ్లెటిక్స్‌)
2. సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (బాక్సింగ్‌)
3. శిఖర్‌ ధావన్‌ (క్రికెట్‌)
4. భవానీ (ఫెన్సింగ్‌)
5. మౌనిక (హాకీ)
6. వందన (హాకీ)
7. సందీప్‌ నర్వాల్‌ (కబడ్డీ)
8. హిమాని పరబ్‌ (మల్లకంబ్‌)
9. అభిషేక్‌వర్మ (షూటింగ్‌)
10. అంకిత రైనా (టెన్నిస్‌)
11. దీపక్‌ పునియా (రెజ్లింగ్‌)
12. దిల్‌ప్రీత్‌ (హాకీ)
13. హర్మన్‌ప్రీత్‌ (హాకీ)
14. రూపీందర్‌ (హాకీ)
15. సురేందర్‌ (హాకీ)
16. అమిత్‌ (హాకీ)
17. బీరేంద్ర (హాకీ)
18. సుమిత్‌ (హాకీ)
19.   నీలకంఠ శర్మ (హాకీ)
20. హార్దిక్‌ సింగ్‌ (హాకీ)
21. వివేక్‌ సాగర్‌ (హాకీ)
22. గుర్జాంత్‌ (హాకీ)
23. మన్‌దీప్‌ (హాకీ)
24. షంషేర్‌ (హాకీ)
25. లలిత్‌ కుమార్‌ (హాకీ)
26. వరుణ్‌ కుమార్‌ (హాకీ)
27. సిమ్రత్‌జీత్‌ సింగ్‌ (హాకీ)
28. యోగేశ్‌ (పారా అథ్లెటిక్స్‌)
29. నిషధ్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌)
30. ప్రవీణ్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌)
31. భవీనా పటేల్‌ (పారా టీటీ)
32. హర్వీందర్‌ సింగ్‌ (పారా ఆర్చరీ)
33. శరద్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌)
34. సుహాస్‌ (పారా బ్యాడ్మింటన్‌)
35. సింగ్‌రాజ్‌ (పారా షూటింగ్‌)

 

ద్రోణాచార్యా అవార్డుకు ఎంపికైన వారు..

ద్రోణాచార్యా జీవిత సాఫల్య పురస్కారం...
1. టీ.పీ.ఉసెప్‌ (అథ్లెటిక్స్‌)
2. సర్కార్‌ తల్వార్‌ (క్రికెట్‌)
3. సర్పాల్‌సింగ్‌ (హాకీ)
4. అషాన్‌కుమార్‌ (కబడ్డీ)
5. తపన్‌ కుమార్‌ (స్విమ్మింగ్‌)

 

రెగ్యులర్‌ ద్రోణాచార్యా...
1. రాధాకృష్ణన్‌ (అథ్లెటిక్స్‌)
2. సంధ్య (బాక్సింగ్‌)
3. ప్రీతమ్‌ (హాకీ)
4. జైప్రకాశ్‌ (పారా షూటింగ్‌)
5. రామన్‌ (రెజ్లింగ్‌)

ద్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం...

1. లేఖ (బాక్సింగ్‌)
2. అభిజీత్‌ కుంతే (చెస్‌)
3. దేవేందర్‌ (హాకీ)
4. వికాస్‌ (కబడ్డీ)
5. సజ్జన్‌ సింగ్‌ (రెజ్లింగ్‌)

చ‌ద‌వండి: భారత్‌కి చెందిన షేక్‌ జాఫ్రీన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Nov 2021 02:50PM

Photo Stories