Skip to main content

Olympics Player: భారత్‌కి చెందిన షేక్‌ జాఫ్రీన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

Sheikh Zafrin

బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. నవంబర్‌ 3వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాఫ్రీన్‌ అవార్డును అందుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలుకు చెందిన జాఫ్రీన్‌ అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు, జాతీయ స్థాయిలో 8 బంగారు పతకాలు సాధించింది. 2017లో టర్కీలో జరిగిన బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. భారత డెఫ్‌ టెన్నిస్‌ జట్టు సారథిగా ఉన్న ఆమె ర్యాంకింగ్స్‌ పరంగా దేశంలో 1వ, అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతోంది.
 

చ‌ద‌వండి: ఫెనెస్టా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారులు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణి అవార్డుకు ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు : అక్టోబర్‌ 31
ఎవరు    : బధిరుల (డెఫ్‌) ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌
ఎందుకు : క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 Nov 2021 06:19PM

Photo Stories