Dubai: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2021 విజేత?
యూఏఈలోని దుబాయ్ వేదికగా 2021, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2021(క్లాసికల్ ఫార్మాట్)లో నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ విజేతగా అవతరించాడు. రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌నిషితో జరిగిన చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కార్ల్‌సన్ విజయం సాధించాడు. దీంతో కార్ల్‌సన్ ఐదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. విజేత కార్ల్‌సన్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్ నిపోమ్‌నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్లాసికల్ ఫార్మాట్‌లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలోనూ కార్ల్‌సన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు.
చదవండి: కేర్ 4 హాకీ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2021(క్లాసికల్ ఫార్మాట్) విజేత?
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
ఎందుకు : రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌నిషితో జరిగిన చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కార్ల్‌సన్ విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్