Skip to main content

Hockey Championship: జాతీయ హాకీ విజేత మధ్యప్రదేశ్‌

జాతీయ మహిళల సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచింది.
Senior National Hockey Championships

కాకినాడ‌లో ఫిబ్ర‌వ‌రి 26న జ‌రిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్‌ 5–1 గోల్స్‌ తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మధ్యప్రదేశ్‌ తరఫున దీక్షా తివారి (2వ నిమిషం, 4వ ని.), మన్‌మీత్‌ కౌర్‌ (38వ ని.), ప్రీతి దూబే (42వ ని.), ఐశ్వర్య చవాన్‌ (42వ ని.) గోల్స్‌ సాధించగా.. మహారాష్ట్ర  జట్టు నుంచి లాల్‌రిండికి (25వ ని.) ఏకైక గోల్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిభ ఆర్యకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మరో వైపు ప్లే ఆఫ్‌ పోరులో హరియాణాను 2–1తో ఓడించిన జార్ఖండ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Ranji Trophy: సౌరాష్ట్ర జట్టుదే రంజీ ట్రోఫీ టైటిల్‌

Published date : 27 Feb 2023 11:55AM

Photo Stories