Ranji Trophy: సౌరాష్ట్ర జట్టుదే రంజీ ట్రోఫీ టైటిల్
బెంగాల్‌తో ఫిబ్రవరి 19న ముగిసిన ఫైనల్లో జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలోని సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 169/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ 241 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ ఆరు వికెట్లు తీయగా.. మరో పేసర్ చేతన్ సకారియా మూడు వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ నిర్దేశించిన 12 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది.
మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు తీసిన ఉనాద్కట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డురాగా.. టోర్నీ మొత్తంలో 907 పరుగులు సాధించిన అర్పిత్ (సౌరాష్ట్ర) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కించుకున్నాడు. 2020లో బెంగాల్ జట్టునే ఓడించి సౌరాష్ట్ర తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. 1990లో చివరిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన బెంగాల్ ఆ తర్వాత ఐదుసార్లు ఫైనల్ చేరగా... ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు