Lasith Malinga: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్?
Sakshi Education
శ్రీలంక స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డేల నుంచి గతంలోనే తప్పుకొని టి20ల్లో మాత్రమే కొనసాగుతూ రాగా, ఇప్పుడు పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 14న మలింగ ప్రకటించాడు. తమ జాతీయ జట్టు తరఫున మలింగ 2020 మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 122 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలోనూ ఆడాడు.
కెరీర్ విశేషాలు...
- 2004లో టెస్టు క్రికెట్‌తో అరంగేట్రం.
- అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు(వన్డేల్లో 3 హ్యాట్రిక్‌లు, టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు) నమోదు.
- అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (107) తీసిన బౌలర్.
- 2014 టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్.
- 4 వరుస బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన అరుదైన ఘనత.
మ్యాచ్‌లు | వికెట్లు | సగటు | |
టెస్టులు | 30 | 101 | 33.15 |
వన్డేలు | 226 | 338 | 28.87 |
టి20లు | 84 | 107 | 20.79 |
చదవండి: పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన మాజీ కెప్టెన్?
Published date : 15 Sep 2021 04:04PM