Skip to main content

Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన మాజీ కెప్టెన్‌?

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా సెప్టెంబర్‌ 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్‌సాన్‌ మని గత నెలలో పీసీబీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ విజేత పాక్‌ జట్టు సభ్యుడైన రమీజ్‌ 2003–2004 వరకు పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

కోచ్‌లుగా హేడెన్, ఫిలాండర్‌...

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌లుగా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మ్యాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ ఫిలాండర్‌లను నియమిస్తున్నట్లు పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా సెప్టెంబర్‌ 13న ప్రకటించారు. వచ్చే నెలలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో వీరిద్దరినీ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాక్‌ జట్టు కోచ్‌లుగా వీరు ఎప్పటి వరకు కొనసాగుతారనే విషయంపై రమీజ్‌ స్పష్టతనివ్వలేదు.

 

చ‌దవండి: క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఎన్నికైన మాజీ కెప్టెన్‌?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 13
ఎవరు    :  రమీజ్‌ రాజా
ఎక్కడ    : పాకిస్తాన్‌
ఎందుకు  : ఎహ్‌సాన్‌ మని గత నెలలో పీసీబీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో...

 

Published date : 14 Sep 2021 03:11PM

Photo Stories