Indonesia Open Masters badminton 2023: ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్‌లో టైటిల్ విజేతగా కిరణ్ జార్జి
Sakshi Education
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు.
జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో 23 ఏళ్ల కిరణ్ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్ కూ తకహాషిపై గెలుపొందాడు. కిరణ్ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Published date : 14 Sep 2023 01:05PM