Skip to main content

Grandmaster: టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన భారతీయుడు?

Arjun Erigaisi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌–2022లో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ విజేతగా అవతరించాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ వేదికగా జనవరి 30న జరిగిన చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్‌ 62 ఎత్తుల్లో మార్క్‌ మౌరిజి (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్‌ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. చాలెంజర్స్‌ టోర్నీ విజేత హోదాలో అర్జున్‌ 2022 ఏడాది జరిగే టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీకి అర్హత పొందాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్‌ తర్వాత టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన నాలుగో భారతీయ చెస్‌ ప్లేయర్‌గా అర్జున్‌ గుర్తింపు పొందాడు.

చ‌ద‌వండి: ఏ నగరం వేదికగా ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌-2022 జరగనుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌–2022లో టైటిల్‌ గెలిచిన భారతీయుడు?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు    : తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : విక్‌ ఆన్‌ జీ, నెదర్లాండ్స్‌
ఎందుకు : చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 62 ఎత్తుల్లో మార్క్‌ మౌరిజి (ఫ్రాన్స్‌)పై గెలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Jan 2022 03:32PM

Photo Stories