Dope Test: డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత డిస్కస్ త్రోయర్?
భారత అగ్రశ్రేణి మహిళా డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దాంతో అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్(ఏఐయూ) కమల్‌ప్రీత్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆమెకు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకం స్టానోజొలాల్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల కమల్‌ప్రీత్ 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ పేరిటే జాతీయ రికార్డు (65.06 మీటర్లు) ఉంది. ఏఐయూను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్(ఐఏఏఎఫ్) స్థాపించింది.
స్విమ్మర్ అభిలాష్‌కు రజతం
కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2022లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్‌టీయూ తరఫున పాల్గొన్నాడు.Chess: చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్