India vs Sri Lanka: ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీ చాంపియన్?
యూఏఈలోని దుబాయ్‌లో డిసెంబర్ 31న ముగిసిన ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీ చాంపియన్‌గా భారత్ నిలిచింది. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్–19 జట్టును చిత్తు చేసింది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. లంక స్కోరు 33 ఓవర్లకు 74/7 ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. అనంతరం ‘డక్‌వర్త్ లూయిస్’ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది.
వెస్టిండీస్ వేదికగా..
2022, జనవరి 14 నుంచి వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరుగుతుంది. జనవరి 15న తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ తలపడుతుంది.
చదవండి: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన భారతీయుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీ చాంపియన్?
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : భారత్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఫైనల్లో భారత జట్లు 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్