Skip to main content

Spain: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన భారతీయుడు?

Kidambi Srikanth

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. డిసెంబర్ 19న స్పెయిన్‌లోని హుఎల్వాలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్‌ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్‌ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి సింగపూర్‌ ప్లేయర్‌గా కీన్‌ యు చరిత్ర సృష్టించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌), ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)లకు కాంస్య పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదు.

ఇది రెండోసారి..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు ఒకేసారి రజత, కాంస్య పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌కు రజతం, లక్ష్య సేన్‌కు కాంస్యం లభించాయి.

అకానె యామగుచికి టైటిల్‌..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌-2021 మహిళల సింగిల్స్‌ విభాగంలోనూ కొత్త చాంపియన్‌ అవతరించింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌) 21–14, 21–11తో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. జపాన్‌ తరఫున నొజోమి ఒకుహారా తర్వాత ప్రపంచ టైటిల్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అకానె ఘనత వహించింది.

చ‌ద‌వండి: మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌-2021 పురుషుల సింగిల్స్‌ విభాగంలో రజతం గెలిచిన భారతీయుడు? 
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు    : భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ 
ఎక్కడ    : హుఎల్వా, స్పెయిన్‌
ఎందుకు : ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయినందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Dec 2021 09:45PM

Photo Stories