Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్-2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

2022, మార్చిలో న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ డిసెంబర్ 15న విడుదలైంది. ఈ షేడ్యూల్ ప్రకారం... 2017 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మార్చి 6న జరిగే తమ తొలి పోరులో పాకిస్తాన్‌తో తలపడుతుంది. మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభ మవుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ప్రపంచకప్‌ను ఆరు వేదికల్లో నిర్వహిస్తుండగా ... ప్రతీ జట్టు మిగిలిన ఏడు టీమ్‌లతో లీగ్ దశలో తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్–4లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
మహిళా క్రికెటర్లతో ‘హ్యుందాయ్’ ఒప్పందం...
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్స్’ నలుగురు భారత మహిళా క్రికెటర్లతో జత కట్టింది. ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, తానియా భాటియాలతో హ్యుందాయ్ ఒప్పందం చేసుకుంది.
చదవండి: నైట్‌హుడ్ పురస్కారం పొందిన రేసింగ్ డ్రైవర్?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్