Formula One: నైట్‌హుడ్ పురస్కారం పొందిన రేసింగ్ డ్రైవర్?
ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. డిసెంబర్ 15న విండ్సర్ లోని విండ్సర్ కాజిల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఎఫ్1 రేసింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లూయిస్ హామిల్టన్‌ను ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్‌గా పిలవనున్నారు. 2007 నుంచి ఎఫ్1లో ఉన్న హామిల్టన్ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు.
ఐఎఫ్‌ఏ షీల్డ్ విజేత?
భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్‌ఏ షీల్డ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు రన్నరప్‌గా నిలిచింది. డిసెంబర్ 15న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఈ టోర్నీలో తొలిసారి పాల్గొన్న శ్రీనిధి డెక్కన్ జట్టు 1–2 గోల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టు చేతిలో ఓడింది. శ్రీనిధి డెక్కన్ క్లబ్ గోల్‌కీపర్ సీకే ఉబైద్‌కు టోర్నీ ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారం లభించింది.
చదవండి: అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్ పురస్కారం పొందిన రేసింగ్ డ్రైవర్?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : విండ్సర్ కాజిల్, విండ్సర్
ఎందుకు : ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్