TIME Magazine: అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన క్రీడాకారిణి?
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు అక్టోబర్ 14న ప్రకటన చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్–2020 సమయంలో తాను ‘ద ట్విస్టీస్’తో బాధ పడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుంది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నాసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది.
భారత చెస్ లీగ్ నిర్వహణ హక్కులను కైవసం చేసుకున్న సంస్థ?
భారత్ వేదికగా చదరంగ క్రీడలో కూడా ఫ్రాంచైజీ తరహా లీగ్ టోర్నీని నిర్వహించాలని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) నిర్ణయించింది. 2022 ఏడాది జూన్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. చెస్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. రెండు వారాల పాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో దేశంలోని రెండు నగరాల్లో టోర్నీని నిర్వహిస్తారు. టోర్నీ నిర్వహణ, ప్రచారం, మార్కెటింగ్ కోసం ‘గేమ్ ప్లాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు హక్కులు ఇచ్చామని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ ప్రకటించారు.
చదవండి: కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్–2021’గా ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
ఎక్కడ : ప్రపంచంలో...
ఎందుకు : క్రీడారంగంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపుపొందినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్