Weightlifting: కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు?
ఉజ్బెకిస్తాన్ రాజధాని నగరం తాష్కెంట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2021లో డిసెంబర్ 13న భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2022 ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు.
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్‌రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్‌హమ్ గేమ్స్‌కు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు.
శ్రీవేద్యకు మహిళల డబుల్స్ టైటిల్
మెక్సికో ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ అమ్మాయి గురజాడ శ్రీవేద్య డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవేద్య (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జోడీ 20–22, 21–17, 21–16తో క్రిస్టల్ లాయ్–అలెగ్జాండ్రా మొకాను (కెనడా) జంటపై నెగ్గింది.
చదవండి: ఎఫ్1లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2021లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్(81 కేజీల విభాగం)
ఎక్కడ : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
ఎందుకు : ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్