Sudhir Naik: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ మృతి
Sakshi Education
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖెడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్(78) ఏప్రిల్ 5న మృతి చెందారు.
ముంబైకి చెందిన సుధీర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్‌లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటు లో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్‌లో రంజీ చాంపియన్‌గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు.
Virat Kohli: ఐపీఎల్‌లో కొహ్లి రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా..
Published date : 06 Apr 2023 03:04PM