Dutee Chand: ద్యుతీ చంద్‌పై నిషేధం
Sakshi Education
భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు భారీ షాక్ తగిలింది.
డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. గతేడాది డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు.
ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల(SARMS) ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు. 27 ఏళ్ల ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ.
Archery World Cup Stage 4: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో భారత్‌కు రెండు కాంస్యాలు
Published date : 19 Aug 2023 05:23PM