Archery World Cup Stage 4: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో భారత్‌కు రెండు కాంస్యాలు
Sakshi Education
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో రెండో రోజూ భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.
ఆగస్టు 17న రికర్వ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్ ప్రభాకర్ షెల్కేలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 6–2తో (54–56, 57–55, 56–54, 57–55) స్పెయిన్ జట్టుపై గెలుపొందింది. సెమీఫైనల్లో భారత్ 0–6తో (54–56, 47–58, 55–56) చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడింది.
world archery championships 2023: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
మహిళల టీమ్ రికర్వ్ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్ కౌర్, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 5–4తో (52–55, 52–53, 55–52, 54–52, 27–25) మెక్సికో జట్టును ఓడించింది.
Published date : 18 Aug 2023 03:18PM