ICC Test Rankings: టాప్–3లో ఒకే దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లు.. 39 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
జూన్ 14న విడుదల చేసిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మిత్ (885 రేటింగ్ పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకోగా.. ట్రావిస్ హెడ్ (884 రేటింగ్ పాయింట్లు) మూడు స్థానాల పురోగతి సాధించి ఆరు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాకే చెందిన లబుషేన్ (903 రేటింగ్ పాయింట్లు) తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఫలితంగా 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒకే దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లు వరుసగా తొలి, రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు.
French Open 2023: మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన సెర్బియా స్టార్.. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్
చివరిసారి 1984లో వెస్టిండీస్ క్రికెటర్లు గార్డన్ గ్రీనిడ్జ్, క్లయివ్ లాయిడ్, లారీ గోమ్స్ వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు. గత డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ పదో ర్యాంక్‌లో, కోహ్లి 12వ ర్యాంక్‌లో, రోహిత్ శర్మ 13వ ర్యాంక్‌ల్లోనే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్ధ సెంచరీలు చేసిన అజింక్య రహానే 37వ ర్యాంక్‌కు చేరుకోగా.. శార్దుల్ ఠాకూర్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 94వ స్థానంలో నిలిచాడు.
World Cup 2023 Schedule: వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. అహ్మదాబాద్‌లో భారత్, పాక్ పోరు..
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం రాకపోయినా భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు పడిపోయి ఎనిమిదో స్థానానికి చేరుకోగా, రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు.