World Cup 2023 Schedule: వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. అహ్మదాబాద్‌లో భారత్, పాక్ పోరు..
ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు. ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే.. సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా.. 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
Asia Cup 2023: భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఘనత.. తొలిసారి ఆసియా కప్ సొంతం
వరల్డ్ కప్‌లో భారత మ్యాచ్‌ల షెడ్యూల్ (బీసీసీఐ డ్రాఫ్ట్ ప్రకారం)
అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11 – అఫ్గనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15 – పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19 – బంగ్లాదేశ్ (పుణే)
అక్టోబర్ 22 – న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29 – ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2 – క్వాలిఫయర్ (ముంబై)
నవంబర్ 5 – దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11 – క్వాలిఫయర్ (బెంగళూరు)
తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే..
లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్‌లో లీగ్ దశకే పరిమితం కాగా.. నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు.
IPL 2023: ఐపీఎల్ 2023 రికార్డులివే.. 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు..
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది. అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది.