Skip to main content

French Open 2023: స్వియాటెక్‌దే ‘ఫ్రెంచ్‌’ కిరీటం.. మూడోసారి విజేతగా నిలిచిన పోలాండ్‌ స్టార్‌

ఎర్రమట్టి కోర్టులపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకుంది.
Swiatek

జూన్ 10న‌ జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ 6–2, 5–7, 6–4తో అన్‌సీడెడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. 2 గంటల 46 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో సంయమనం కోల్పోకుండా ఆడిన డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 23 లక్షల యూరోలు (రూ.20 కోట్ల 41 లక్షలు), రన్నరప్‌ ముకోవాకు 11 లక్షల 50 వేల యూరోలు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా స్వియాటెక్‌ కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2022లో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన స్వియాటెక్‌.. 2020, 2022లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది.  

French Open 2023: మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌.. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్

ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన స్వియాటెక్‌ తుది పోరులోనూ శుభారంభం చేసింది. రెండో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ముకోవా సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన స్వియాటెక్‌ 48 నిమిషాల్లో తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో ముకోవా తేరుకుంది. ఐదో గేమ్‌లో స్వియాటెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో స్వియాటెక్‌ సర్వీస్‌ను ముకోవా బ్రేక్‌ చేసినా, ఆ వెంటనే తన సర్వీస్‌ను కోల్పోవడంతో స్కోరు 5–5తో సమమైంది. కానీ 11వ గేమ్‌లో స్వియాటెక్‌ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్‌ చేసిన ముకోవా ఈసారి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–5తో 71 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్‌లో ముకోవా రెండుసార్లు స్వియాటెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసినా కీలకదశలో ఒత్తిడికి లోనై తన సర్వీస్‌లను కాపాడుకోవడంలో విఫలమైంది. పదో గేమ్‌లో ముకోవా తన సర్వీస్‌లో డబుల్‌ ఫాల్ట్‌ చేసి గేమ్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను కోల్పోయింది.  

Athletics Rankings: నీర‌జ్ చోప్రా మ‌రో ఘ‌న‌త‌.. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం

ఫైనల్‌ గణాంకాలు 
స్వియాటెక్‌        ముకోవా 
1    ఏస్‌లు    6 
3    డబుల్‌ ఫాల్ట్‌లు    3 
7/11    బ్రేక్‌ పాయింట్లు    5/7 
19    విన్నర్స్‌    30 
27    అనవసర తప్పిదాలు    38 
10/24    నెట్‌ పాయింట్లు    18/28 
4    డ్రాప్‌ షాట్‌లు    20 
96    మొత్తం పాయింట్లు    81 

☛ మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా), క్రిస్‌ ఎవర్ట్‌ (అమెరికా), స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ), మోనికా సెలెస్‌ (యుగోస్లావియా), జస్టిన్‌ హెనిన్‌ (బెల్జియం) తర్వాత కనీసం వరుసగా రెండేళ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన ఆరో క్రీడాకారిణిగా స్వియాటెక్‌ నిలిచింది. 
☛ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కనీసం మూడుసార్లు సాధించిన ఎనిమిదో క్రీడాకారిణిగా స్వియాటెక్‌ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో క్రిస్‌ ఎవర్ట్‌ (అమెరికా; 7 సార్లు), స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ; 6 సార్లు), జస్టిన్‌ హెనిన్‌ (4 సార్లు), మార్గరెట్‌ కోర్ట్‌ (3 సార్లు), అరంటా సాంచెజ్‌ (స్పెయిన్‌; 3 సార్లు), మోనికా సెలెస్‌ (3 సార్లు), సెరెనా విలియమ్స్‌ (అమెరికా; 3 సార్లు) ఉన్నారు. 
☛ ఓపెన్‌ శకంలో (1968 నుంచి) తాము ఫైనల్‌ చేరిన తొలి నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ల లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్‌ నిలిచింది. గతంలో మోనికా సెలెస్, నయోమి ఒసాకా (జపాన్‌) ఈ ఘనత సాధించారు.  

May Weekly Current Affairs (Sports) Bitbank: ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్, వన్డే, టీ20, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించిన క్రికెటర్ ఎవరు?

Published date : 12 Jun 2023 06:10PM

Photo Stories