Skip to main content

ATP Challenger–100 Tournament: ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో విజేతగా యూకీ బాంబ్రీ–జూలియన్‌ క్యాష్ జోడి

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.
Yuki Bambry-Julian Cash duo won the ATP Challenger–100 tournament
Yuki Bambry-Julian Cash duo won the ATP Challenger–100 tournament

ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్‌ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ రాబర్ట్‌ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జంటను ఓడించింది.

World Under-23 Wrestling Championship: రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం

గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. టైటిల్‌ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్‌ టోర్నీ (స్పెయిన్‌), నొంతబురి (థాయ్‌లాండ్‌) చాలెంజర్‌ టోర్నీలో కూడా డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు.   

Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల్లో సెంచ‌రీ కొట్టిన‌ భారత్

Published date : 30 Oct 2023 01:05PM

Photo Stories