Skip to main content

Junior World Boxing Championships: 17 పతకాలు సాధించిన భారత జూనియర్‌ బాక్సర్‌లు..

అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ను చాటుకున్నారు.
17 medals for India in World Junior Boxing Championships   Indian Athletes Shine at World Junior Boxing Championship
17 medals for India in World Junior Boxing Championships

 అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్‌ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్‌కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి.

Junior World Boxing Championships: ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు

మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్‌ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు  సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో పాయల్‌ 5–0తో హెజినె పెట్రోసియాన్‌ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్‌ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్‌)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు.

ఇతర ఫైనల్స్‌లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్‌ (ఐర్లాండ్‌) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్‌ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్‌ (75 కేజీలు), హేమంత్‌ సాంగ్వాన్‌ (ప్లస్‌ 80 కేజీలు), జతిన్‌ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు.

ITF Tournament: ఐటీఎఫ్‌ మహిళల డబుల్స్‌లో విజేత‌గా రష్మిక –వైదేహి ద్వయం

Published date : 05 Jan 2024 04:34PM

Photo Stories