Skip to main content

ITF Tournament: ఐటీఎఫ్‌ మహిళల డబుల్స్‌లో విజేత‌గా రష్మిక –వైదేహి ద్వయం

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు రాణించారు.
World Tennis Tour  Doubles title for Rashmika Vaidehi duo in ITF Tournament  Ahmedabad champions

అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ టో ర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్‌ సొంతం చేసుకుంది. డబుల్స్‌ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్‌–ఆకాంక్ష (భారత్‌) జోడీపై గెలిచింది. 

Hockey Nationals 2023: జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో విజేతగా పంజాబ్‌

మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్‌ 6–2, 6–1తో డేవిడ్‌ పిచ్లార్‌ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. 

Davis Cup 2023: డేవిస్‌ కప్ టైటిల్ విజేతగా ఇటలీ

Published date : 04 Dec 2023 01:26PM

Photo Stories