Operation: ఏ దేశ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు?
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ నగరానికి చెందిన 57 ఏళ్ల ఆసామి డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి వైద్యులు.. పంది గుండెను అమర్చారు. గుండె జబ్బుతో కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన ఆయనకు.. ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి తలెత్తడంతో పంది గుండెను అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు ఈ ఘనత సాధించారు. బెన్నెట్‌కు 2022, జనవరి 7న గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు పంది గుండెను అమర్చారు. ఇలాంటి ఆపరేషన్లలో ఇప్పటికి విజయవంతమైన వాటిల్లో ఇదే మొదటిది. ఆపరేషన్ కోసం జన్యుమార్పులు చేసి కృత్రిమంగా పెంచిన పందిని వినియోగించారు.
చదవండి: మ్యాన్ పోర్టబుల్ మిసైల్‌ను పరీక్షించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏ దేశ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు?
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు
ఎక్కడ : బాల్టిమోర్, మేరీల్యాండ్, అమెరికా
ఎందుకు : గుండె జబ్బుతో కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన డేవిడ్ బెన్నెట్‌కు.. ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి తలెత్తడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్