MPATGM: మ్యాన్ పోర్టబుల్ మిసైల్‌ను పరీక్షించిన దేశం?
మనిషి మోసుకెళ్లగల ట్యాంక్ విధ్వంసక క్షిపణిని భారత్ జనవరి 11న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ (ఎంపీఏటీజీఎం) బరువు చాలా తక్కువని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. 2.5 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులను ఇది ఛేదించగలదని పేర్కొంది. గత ప్రయోగాల్లో అది గరిష్ఠ పరిధి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగా.. తాజా పరీక్షలో కనిష్ఠ పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తాను పరిశీలించారు. ఈ అస్త్రంలోని చిన్నపాటి ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్, అధునాతన ఏవియానిక్స్ వంటివి లక్ష్యం దిశగా మార్గనిర్దేశం చేస్తాయి.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో జనవరి 10న ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు.
చదవండి: బ్రహ్మోస్ నేవీ క్షిపణి పరీక్షను ఏ నౌక నుంచి నిర్వహించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్