DRDO: బ్రహ్మోస్ నేవీ క్షిపణి పరీక్షను ఏ నౌక నుంచి నిర్వహించారు?
సముద్రతలం నుంచి ప్రయోగించి సముద్రం మీది లక్ష్యాలను(సీ టూ సీ) ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక నుంచి నేవీ వేరియంట్ అడ్వాన్స్ బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) జనవరి 11న వెల్లడించింది. క్షిపణి కచ్చితత్వంతో దూసుకెళ్లి లక్షిత ఓడను ఢీకొట్టి, ధ్వంసం చేయడంతో ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. పీజే –10 ప్రాజెక్ట్ కింద రూపొందించిన ఈ క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్, ఎయిర్ ఫ్రేమ్‌ను ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా తయారు చేశారు.
బ్రహ్మోస్ క్షిపణిని రష్యా, భారత్ సంయుక్త ప్రాజెక్టుగా సిద్ధం చేయడం విదితమే. శత్రు రాడార్ నుండి తప్పించుకుంటూ లక్ష్యాన్ని ఛేదించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ 21వ శతాబ్దపు అత్యంత అధునాతన క్షిపణులలో ఒకటిగా పేరొందింది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. గతంలో 290 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగా తాజాగా దాని పరిధిని 350–400 కి.మీ.లకు పెంచారు.
చదవండి: డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సముద్రతలం నుంచి ప్రయోగించి సముద్రం మీది లక్ష్యాలను(సీ టూ సీ) ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక నుంచి..
ఎందుకు : భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్