EVD: ట్విండెమిక్ అంటే ఏమిటీ? ఫైలో వైరస్ అని దేన్ని అంటారు?
అమెరికాలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్ మోడల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు.
కాంగోలో ఎబోలా కేసు..
ప్రమాదకరమైన ఎబోలా వైరస్ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. అక్టోబర్ 6న ఇది జరిగిందని అధికారులు తెలిపారు. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు.
ఫైలో వైరస్...
ఎబోలా వైరస్ వ్యాధి ... వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలా వైరస్‌ను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు. ఎబోలా వైరస్.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్ అని కూడా అంటారు.
చదవండి: ఎబోలా వైరస్ వ్యాప్తి.. విజృంభణ - ముఖ్యాంశాలు
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్