ChatGPT false: ఇదేందయ్య ఇది... చాట్ జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్
టెక్సాస్ యూనివర్సిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు.
➤☛ డేటా లీకేజీ ఉదంతంతో చాట్ జీపీటీపై ఇటలీ నిషేధం
విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. చాట్ జీపీటీ చేస్తున్న అద్భుతాలను మనం ఇప్పటికే వేలల్లో చూశాం... చదివాం. పాటలు, సాహిత్యాన్ని రాస్తోంది. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను కూడా అందిస్తూ అబ్బురపరుస్తోంది. దీంతో ఆ ప్రొఫెసర్ దీన్ని గుడ్డిగా నమ్మడం మొదలు పెట్టాడు.
ఫైనల్ ఎగ్జామ్స్‌లో తాము రాసిన వ్యాసాలను ఆ విద్యార్థులు ప్రొఫెసర్‌కు సమర్పించారు. అయితే అతను వాటిని చదివి కరెక్షన్ చేయకుండా చాట్ జీపీటీ సహాయం తీసుకున్నాడు. జవాబు పత్రాలను చాట్ జీపీటీతో స్కాన్ చేశాడు. విద్యార్థులు రాసిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని అందరినీ ఫెయిల్ చేశాడు.
➤☛ 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ
అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు.