Sunita Williams: మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్!
భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్‌లో సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి జూన్ 1వ తేదీ(ఈ రోజు) రాత్రి 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్‌లో అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు.
ఈ మిషన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న అంతరిక్ష కేంద్రానికి (ISS) వ్యోమగాములను చేరవేయడానికి బోయింగ్ స్టార్‌లైనర్ ప్రాజెక్ట్‌లో భాగం.
అంతరిక్షంలో ఏమి జరగనుంది?
➤ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఒక వారం పాటు ఐఎస్‌ఎస్‌లోని హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరును పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేస్తారు.
➤ ఈ మిషన్ విజయవంతమైతే, నాసా స్టార్‌లైనర్‌ను సిబ్బందితో కూడిన అంతరిక్ష కేంద్ర మిషన్లకు ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.
➤ ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ మాత్రమే ఈ రకమైన సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
➤ స్టార్‌లైనర్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించబడితే, అది వాణిజ్య అంతరిక్ష ప్రయాణాల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధిస్తుంది.
Agnibaan Rocket: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
సునీతా విలియమ్స్ గురించి..
➤ సునీతా విలియమ్స్ ఒక అనుభవజ్ఞురాలైన వ్యోమగామి.. 2006, 2012లో రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించారు.
➤ ఆమె భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి.
➤ ఈ మూడో మిషన్‌తో ఆమె అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించనున్నారు.
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు.