Agnibaan Rocket: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
Sakshi Education
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి మే 30వ తేదీ ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు
ఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది.
India vs China: టగ్ ఆఫ్ వార్‌లో చైనాను ఓడించిన భారత సైనికులు
Published date : 30 May 2024 12:49PM