India vs China: టగ్ ఆఫ్ వార్‌లో చైనాను ఓడించిన భారత సైనికులు
సుడాన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా నిర్వహించిన 'టగ్ ఆఫ్ వార్' పోటీలో భారత సైనికులు చైనా సైనికులను ఓడించారు. ఈ విషయాన్ని భారత సైన్య అధికారులు వెల్లడించారు.
ఈ పోటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టగ్ ఆఫ్ వార్ లో భారత్, చైనా జట్లు పోటీ పడ్డాయి. భారత జట్టు అద్భుతమైన టీంవర్క్, పట్టుదలతో చైనా జట్టును ఓడించింది. ఈ స్నేహపూర్వక పోటీ అక్కడ ఉన్న మిగిలిన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials
— ANI (@ANI) May 28, 2024
(Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3
➤ 24 మార్చి 2005న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో ఏర్పాటైంది.
➤ సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ మధ్య 9 జనవరి 2005న శాంతి ఒప్పందం కుదిరింది.
➤ అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
US Satellite: అంతరిక్ష యుద్ధం.. శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా!!