US Satellite: అంతరిక్ష యుద్ధం.. శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా!!
Sakshi Education
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, రెండు దేశాల మధ్య అంతరిక్ష యుద్ధం ఊహాగానాలకు దారితీసింది.
మే 16వ తేదీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఉపగ్రహాన్ని భూమి యొక్క దిగువ కక్ష్యలోకి ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ అన్నారు.
ఈ ఉపగ్రహం అంతరిక్షంలోని ఇతర ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అమెరికా యొక్క "యూఎస్‌ఏ-314" ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని ఆరోపించాడు.
దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్–2.1బీ వాహక నౌక ద్వారా ‘కాస్మోస్ 2576’ ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
WASP-193: కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..
Published date : 23 May 2024 12:34PM