Skip to main content

Samudrayan Project: సముద్రాల గుట్టు ఛేదించే మత్స్య యంత్రం

సముద్రయాన్‌ ప్రాజెక్టు కింద డీప్‌ వాటర్‌ వెహికల్‌ అభివృద్ధి
Samudrayaan project for deep ocean exploration launched
Samudrayaan project for deep ocean exploration launched

సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్‌
‘డీప్‌ ఓసియన్‌ మిషన్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్‌ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది.

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌ను ఏ MF హౌస్ ప్రారంభించింది?

ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. 
సముద్రయాన్‌ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్‌ వాటర్‌ సబ్‌ మెర్సిబుల్‌ వెహికల్‌)ను భారత్‌ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించింది?

మత్స్య 6000 పేరుతో.. 
ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్‌డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్‌ వాటర్‌ వెహికల్‌ ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్‌ వాటర్‌ వెహికల్‌ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

  • సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్‌వాటర్‌ వెహికల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. 
  • మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్‌ వాటర్‌ వెహికల్‌ ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
  • సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్‌ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్‌ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. 
  • ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల
  • అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్‌ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు.  

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఏ గ్రహం యొక్క కొత్త చిత్రాలు తీయబడ్డాయి?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 20 Sep 2022 06:24PM

Photo Stories